మండపేట నియోజక వర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలి
మండపేట జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష..

మండపేట (CLiC2NEWS): మండపేట నియోజక వర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ మండపేట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు రిలే నిరాహారదీక్షలకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా శిబిరం ఏర్పాటు చేసి మంగళవారం దీక్షలు ఆరంభించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. తొలి రోజు దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులకు ఆయన పూల మాలలు వేసి దీక్షలు ప్రారంభింపజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గా రాణి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ తదితర నాయకులు విచ్చేసి నిరవధిక దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని కోరారు.
తొలిరోజు దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, ఏఐసీసీ సభ్యులు మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కామన ప్రభాకరరావు, సీఐటియూ నాయకురాలు కె కృష్ణవేణి, ఉండ్రాజవరపు అర్జున్, మల్లువలస గణపతి, బొజ్జా వీర వెంకట రామకృష్ణ, షేక్ నబీ, ఏపీడబ్ల్యూ జేఎఫ్ నాయకుడు వేమగిరి నూకరాజు, పుత్సల శ్రీనివాస్, గొడవర్తి రామచంద్రరావు, టేకి శ్రీనివాస్, వారా నాగేంద్రప్రసాద్, మల్లవరపు వెంకట్రావు, డోకుబుర్ర రాజబాబు, నామాల చంద్ర రావు, బొజ్జా వీర వెంకట రామకృష్ణ, వాదా ప్రసాదరావులు పాల్గొన్నారు.
సంఘీభావం తెలిపిన వారిలో కౌన్సిల్ విప్ పోతంశెట్టి వరప్రసాద్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఉంగరాల రాంబాబు, ఎంపీఎస్ విద్యాసంస్థల డైరెక్టర్ వల్లూరి చిన్నారావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు దూళి జయరాజు, గుండు తాతరాజు, వీరమల్లు శ్రీనివాస్, పెంకే వెంకట్రావు, కేతా వెంకటరమణ, వీరమల్లు శ్రీనివాస్, రావూరి బాబురావు, కుక్కల రామారావు, పెంకే గంగాధర్, కోళ్లశ్రీనివాస్, బొత్స నరసింహమూర్తి, చెల్లూరి కుమారస్వామి తదితరులు ఉన్నారు.