మండపేట ప్రజల రెండవ రోజు రిలే నిరాహారదీక్ష..
మండపేటను రాజమహేంద్రవరంలో విలీనం చేయాలి
మండపేట: ప్రజల సౌలభ్యం సౌకర్యం పరిగణలోకి తీసుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంలో మండపేట నియోజకవర్గంను విలీనం చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మండపేటను రాజమహేంద్రవరంలో విలీనం చేయాలని కోరుతూ చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు బుధవారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్సార్సీపీ మాజీ కో ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంస్థల సభ్యులు దీక్షల్లో పాల్గొన్నారు. వీరిని పూలమాలలతో అలంకరించి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటున్న డిమాండును ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు దూలి జయరాజు, ఎస్సీ సెల్ నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బొత్సా నరసింహమూర్తి, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షుడు గాలింకి నాగేశ్వరరావు, పలివెల ప్రసాద్, వీ హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి బొజ్జా వీరవెంకట రామకృష్ణ, మేడిద సత్యనారాయణ, వీహెచ్ పీఎస్ మండపేట అధ్యక్షుడు నురుకుర్తి లోవరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోడి శివ, గొల్లపుంత కాలనీ వైయస్సార్ ప్రెసిడెంట్ గనిపే నాగభూషణం, బాబూ జగజ్జీవన్ రామ్ యూత్ ప్రెసిడెంట్, ఎం శ్యాం ప్రసాద్, కాకాడ నూకరాజు, వెలగతోడు వీహెచ్ పి ఎస్ నాయకులు మచ్చా శ్రీనివాసరావు, వై వెంకటేష్, ఎం మణికంఠ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, టీడీపీ టౌన్ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అప్పురబోతు దుర్గాప్రసాద్, ఉండ్రాసపు అర్జున్, వీరమల్లు శ్రీనివాస్, చుక్కల అప్పారావు, చెల్లూరి కుమారస్వామి, వెంటపల్లి జాన్ మార్క్, రావూరి బాబురావు, షేక్ నబీ, మల్లు వలస గణపతి, సిద్దిరెడ్డి రామన్న, సత్తి ధనుంజయ రెడ్డి, పోలిమాటి ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.