ఎస్.వి.రమణా చారి: శంకరా నీవే మాకు రక్ష

ఆయనదో ఓ గమ్మత్తు
పేరు పలికితేనే వస్తుంది మహత్తు
పైపైకి మాత్రం బైరాగి
ఉండేది బొందల గడ్డ
శరీరమంతా భస్మం పూత
అయితేనేమీ చీమకుట్టాలన్నా
ఆయనే ఆజ్ఞఇవ్వాలంటా
హలాహలాన్ని ఆనందంగా తాగాడు
పరుల బాధలను తొలంగించాడు
గరళ కంఠుడిగా మారాడు
గంగను తలపైమోసి
విషనాగును కంఠములో వేసి
సిగపై నెలవంకను ధరించి
ఢమరుక తాండవంతో
దర్శనమిచ్చే సామీ
రూపం ఏదైతేనేమీ
భక్తులపక్షం వుండే ఓ భక్త వశంకరా
మారేడు దళం, దోసిలినీటికి
సంతృప్తిని చెందే భోళాశంకరా
అందరికీ అందే దైవం నీవు
శంకరా…నీవే నీవే మాకు రక్ష
-ఎస్.వి.రమణా చారి
సీనియర్ జర్నలిస్టు
సెల్: +91 98498 87086
తప్పకచదవండి:ఎస్.వి.రమణా చారి: మళ్లీ యుద్ధమా..