పెట్రోల్ ధరల తగ్గింపు పై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన హర్షం

మండపేట (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెరిగిన ధరలను భారీ స్థాయిలో తగ్గించడం పట్ల అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ 9.50, డీజిలు 7రూ తగ్గించి వినియోగదారులకు ఊరట కలిగించిందన్నారు. పీఎం ఉజ్వలయోజన పథకం ద్వారా గ్యాస్ సిలెండరు 200రూ రాయితీ 9కోట్ల మందికి ఊరటనిచ్చిందన్నారు. దీంతో పాటు సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారన్నారు.