రాష్ట్రంలో ఎలెస్ట్ కంపెనీ భారీ పెట్టుబడి..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రూ. 24 వేల కోట్లు డిస్ప్లే ఫ్యాబ్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఎలెస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకుంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలెస్ట్ కంపెనీ ఈ పెట్టుబడితో తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంద్రి కెటిఆర్‌తో బెంగళూరులో జరిగిన సమావేశంలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఛైర్మన్ రాజేష్ మెహతా పాల్గొన్నారు. ఈ పెట్టుబడి ద్వారా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, లాప్ టాప్‌లు వంటి డిస్ ప్లేలను తయారు చేయనుంది. ఎలెస్ట్ కంపెని ప్రపంచ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కంపెనీని ఆమోలెడ్ డిస్ప్లే, లిథియం ఆయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.