అసోం. మేఘలయాలో వరదలు.. 31 మంది మృతి

గౌహతి (CLiC2NEWS): అసోం, మేఘాలయాలో భారీ వర్షాల వలకల వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజుల నుంచి వదరల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు రాష్ట్రాల్లో దాదాపు 31 మంది మరణించారు. అసోంలోని పలు జిల్లాల్లో దాదపు 19 లక్షల మంది ఈ ప్రభావానికి గురయ్యారు. ఇప్పటి కే లక్షమందికి పైగా రిలీఫ్ క్యాంపు కార్యాలయంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అసోంలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా, మేఘలయాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అగర్తలాలో భారీస్థాయిలో వరదలు వచ్చాయి. ఈ ఆకస్మిక వరదల వల్ల అక్కడి పాఠశాలలు మూసివేశారు. వరదల్లో చనిపోయాన కుటుంబాలకు మేఘాలయా సిఎం 4 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.