Mandapet: డిగ్రీ విద్యార్హ‌త ఉన్న అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌..

మండపేట డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు..

మండపేట (CLiC2NEWS): మండపేట, పరిసర ప్రాంతాల్లో డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థులకి ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించ‌డానికి అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వ‌చ్చింది. ఈ మేర‌కు డిగ్రీ క‌ళాశాల ప్రిన్సిపాల్ టీ కే వీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఈ నెల 20న మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో క్యాంపస్ ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 500 మందికి ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించ‌నున్నారు. డిగ్రీ పాస్ కానివారికి కూడా అవకాశం ఉందని, డిగ్రీలో కెమిస్ట్రీ తీసుకున్న విద్యార్థులంతా ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద శనివారం ఉదయం 9గంటల నుండి పేర్లు నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు హాజరై తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.