9 ఏళ్ళ కల ఫలించిన వేళ.. చిన్నారికి నామకరణం చేసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తమ బిడ్డకు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్న దంపతుల కల నేడు నెరవేరింది. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్-అనిత దంపతులు నాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.వారికి 2013లో ఆడబిడ్డ జన్మించింది. తమ బిడ్డకు నాటి ఉద్యమ సారధి, నేటి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వాళ్ల పాపకు ఇప్పటి వరకూ పేరు పెట్టలేదు. ఈ విషయం తెలుసుకున్న మాజి స్పీకర్, మధుసూదనాచారి వారిని ప్రగతిభవన్‌కు తీసుకొచ్చారు. సిఎం కెసిఆర్ దంపతులు ఆ దంపతులకు ఆతిథ్యమిచ్చి నూతన వస్త్రాలు బహుకరించారు. వారి పాపకు మహతి అని నామకరణం చేశారు. ఆమె ఉన్నత చదువు కోసం ఆర్ధికసాయం అందజేశారు. తమ తొమ్మిదేళ్ల కల సాకరం అయినందుకు సురేశ్ కుటుంబం సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమను ఆదరించి దీవించిన తీరుకు వారి సంతోషానికి అవధుల్లేవు.