BUDGET-2023: ఆదాయపన్ను పరిమితి రూ. 7 లక్షలకు పెంపు

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (బుధవారం) పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్ లో కేంద్రం ఉద్యోగులకు ఊరటనిస్తూ మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల ఆదాయ పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. అయితే ఇది కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో వేతన జీవులకు ఊరట లభించినట్లయింది.
- ప్రస్తుత మున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు..
- ఆదాయం రూ. 7 లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను
- 0-3 లక్షల వరకు నిల్
- 3-6 లక్షల వరకు 5 శాతం పన్ను
- 6-9 లక్షల వరకు 10 శాతం పన్ను
- 9-12 లక్షల వరకు 15 శాతం పన్ను
- 12-15 లక్షల వరకు 20 శాతం పన్ను
- రూ. 15 లక్షలు ఆదాయం దాటితే 30 శాతం పన్ను
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
BUDGET-2023: లోక్సభ ముందుకు కేంద్ర బడ్జెట్
BUDGET-2023: రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు
BUDGET-2023: గృహ కొనుగోలు దారులకు శుభవార్త
BUDGET-2023: దేశంలో పెరగను్న నర్సింగ్ కాలేజీలు
BUDGET-2023: ఎన్నికల వేళ కర్ణాటక రాష్ట్రానికి రూ. 5,300 కోట్ల కేటాయింపులు