రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/accident-assam..-7-engineering-students-deid.jpg)
గువాహటి (CLiC2NEWS): అస్సాంలోని గువాహటిలోని జాలూక్బరీ ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఆస్సాం ఇంజినీరింగ్ కాలేజ్లో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా కారులో కాళాశాల నుండి బయలు దేరారు. కారు అదుపు తప్పి డివైడర్ను దాటుకొని య ఎదురుగా వస్తున్న వ్యాన్ను బలంగా ఢీకట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గరు విద్యార్థులు, వ్యానులో ఉన్న మరో మగ్గురికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను కారును అద్దెకు తీసుకొని ఆర్ధరాత్రి బయలుదేరి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.