రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/02/kcre-press-meet.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని కుల వృత్తుల ఆధారంగా జీవనం సాగించేవారికి ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. రూ. లక్ష చొప్పున దశల వారీగా ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలు మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ సిఎంకు వివరాంచారు. ఈ కార్యక్రమంగా వేగంగా జరగాలని సిఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.