నిత్య జీవింతంలో యోగా ప్రాధాన్యత!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/yoga-750x430.jpg)
”ప్రియమైన యోగా సాధకులందరికీ నమస్కారం.. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం. కావున అంతర్జాతీయంగా జరుపుకునే యోగ కార్యక్రమంలో అందరు పాల్గొని యోగ యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నా.. ఈ వ్యాసం ద్వారా వీక్షకులకు నిత్యజీవితంలో యోగా ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నా.” -మీ యోగా మాస్టర్ బాహార్ అలీ
యోగా ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం..
“యోగేన చిత్తస్య పదేనా వాచం
మలం శరీరస్య చవైద్యకేనా యోపాకరోత్తం ప్రవరం మునినాం
పతంజలిం ప్రాంజలి రానాతోష్మి”
మానసిక కల్మషములను యోగము ద్వారాను, వాగ్దోషములను వ్యాకరణము ద్వారాను, శారీరక రుగ్మతలను ఆయుర్వేదం ద్వారాను తొలగించిన ముని శ్రేష్టుడు పతంజలికి ముఖళిత హస్తములతో నా నమస్కృతులు నందజేయుచున్నాను.
యోగం అనేది ఒక పూర్ణ విజ్ఞానం, యోగ అంటే ఒక పూర్ణ చికిత్స పద్ధతి, ఒక పూర్ణ జీవనశైలి, ఒక పూర్ణ ఆధ్యాత్మిక విద్య అయి వున్నది. యోగ రహస్యం ఇది. లింగం, జాతి, వర్గం, భాష, సంప్రదాయం, క్షేత్రం, మరియు భాషభేదముల యొక్క సంకిర్ణత్వంతో బందిచబడలేదు. సాధకులు, యోగులు, మునులు, ఋషులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు, అందరూ దీనిని సాధన చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.
యోగ గురించి చెప్పాలంటే జంతువు స్థితి నుండి దైవ స్థితి రావటమే యోగం అని “స్వామి వివేకానంద“ చెప్పారు.
“యోగస్తు కర్మ కౌసల్యం “యోగ అంటే మనం చేసే ప్రతి పని చాలా నైపుణ్యంతో కుశలతతో చేయడం. యోగ అభ్యసిస్తున్నావారు చేపట్టిన పని విజయవంతం అయి తీరుతుంది అనడంలో సందేహం లేదు. యోగ అభ్యాసకులు పొగడ్త –నింద, విజయం- అపజయం, సిద్ధి,-ఆసిద్ధి, సఫలత- విఫలత, సమానంగా స్వీకరిస్తారు.
యోగ అనేది మన శరీరం ఎక్కడ ఉంటుందో, మన మనసుని కూడా అక్కడే ఉంచుకున్నపుడు మనకి ఆనందం అనేది కలుగుతుంది. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉన్నపుడు చెప్పే పాఠం సరిగ్గా అర్ధం కాదు. చిన్నపుడు చదువుకునే రోజులు తలుచుకుంటే తెలుస్తుంది. మనం ఇప్పటికి జీవితంలో కూడా అలానే శరీరం మనసు యొక్క కలయిక సరిగా ఉంచకపోవటం వలన ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అవే వ్యాధుల రూపంలో వస్తున్నాయి. ఇలాంటి శారీరక రోగాలను, మానసిక రోగాలను యోగ ద్వారా తగ్గించుకోవచ్చు.
ఆసనాలు
“స్థిరం సుఖాసనం”అంటే ఏ భంగిమాలో అయితే మనం స్థిరంగా, సుఖంగా ఉండగలమో అదే ఆసనం అని పతంజలి మహర్షి పేర్కొన్నారు. మన శరీరాన్ని కొన్ని భంగిమల్లో ఉంచినపుడు శరీరంలో శక్తి విడుదల అవుతుంది. వీటి వలన శరీరంలోని నాడి వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థలు మధ్య మరింత సమన్వయం, సమతుల్యత ఏర్పడి శరీరం దృడం అవుతుంది.
దాదాపు 5000 సంవత్సరాల పూర్వమే భారతీయ సాంప్రదాయ సంస్కృతుల సమ్మిళతమై తత్వ శాస్త్రమైన యోగ ఈనాడు కంప్లిమెంటరీ మెడిసిన్గా రూపుదాల్చుకుంది. మనంఇది గమనిస్తే యోగ ఆరోగ్యశాస్త్రంగా చెప్పబడలేదు. కానీ ఈ రోజు అనేక వ్యాధులు సైకోసోమాటిక్ వ్యాధులు యోగ ద్వారా తగ్గటం మనం గమనిస్తున్నాం.
యోగ చేయటం వలన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి.. వేడి పుట్టి చెమట ద్వారా టాక్సిన్స్ బయటికి వచ్చి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మెదడుకు, గుండెకు రక్తప్రశరణ బాగా జరిగి మెదడు చైతన్యవంతం అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. బరువు, తగ్గిస్తుంది అన్ని జబ్బులు కాకపోయినా కొన్ని జబ్బులను యోగా సాదన ద్వారా తగ్గించుకోవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
-యోగా మాస్టర్ బాహార్ అలీ
సెల్: .7396126557