ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు: సిఎం జగన్
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/cm-jagan.jpg)
అమరావతి (CLiC2NEWS): ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గురువారం సిఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి అభివృద్దిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండేలా చూడాలని.. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నట్లు సిఎంకు తెలిపారు. అన్ని తరహా ప్రభుత్వం స్కూళ్లో టాప్-10 ర్యాంకులను 64 మంది సాధించారని.. కాలేజీలో టాప్-10 ర్యాంకులు 27 మంది విద్యార్థులు సాధించినట్లు అధికారులు వివరించారు.
ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ప్రతి మండలంలో రెండు జూనియార్ కాలేజీలు ఉండేలా చూడాలన్నారు. ఒకటి బాలికలకు, రెండోది కో-ఎడ్యుకేషన్‌గా ఉండాలన్నారు. వచ్చే జూన్ నాటికి ఈ కాలేజీలు ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు.
జనాభా అధికంగా3 ఉన్న ప్రాంతాల్లో మండలాలకు రెండు గ్రామాలు లేదా.. పట్టణాల్లో రెండు హైస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. వాటిని జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని సిఎం అన్నారు.