దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. వాగులో పడిన వాహనం

కొత్తగూడెం (CLiC2NEWS): భద్రాచల సీతారామస్వామి దర్శనానికి వెళ్లి వస్తూ.. వాహనం ప్రమాదానికి గురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని వాగు సమీపంలో వాహనం అదుపుతప్పి వంతెన కిందకి పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. మరణించిన వారిలో దుర్గారావు, శ్రీనివాసరావు, ప్రదీప్, సందీప్‌లుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులు ఎపిలోని ఏలూరు జిల్లా టి. నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందినవారు. వీరంతా భద్రాచలం టెంపో వాహనంలో వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగు ప్రయాణంలో వాహనం ప్రమాదానికి గురైంది