జలమండలి ఎస్టిపిల ప్రాంగణాల్లో హరితోత్సవం
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/JALAMANDALI-2.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహిస్తున్న హరితోత్సవం సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ నగరంలోని ఫతేనగర్ మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు.
కొత్తగా నిర్మిస్తున్న 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశ మల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాకా (సింహాచలం సంపంగి) వంటి మొక్కల్ని నాటే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మొక్కలు ఎస్టీపీల నుంచి వచ్చే దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయని తెలిపారు. ఆక్సీజన్ అధికంగా ఉత్పత్తి చేసే అల్లనేరేడు, మహాగని, బిగ్నోనియా లాంటి మొదలగు మొక్కలు సైతం నాటుతున్నామన్నారు.
హరితోత్సవం సందర్భంగా.. జలమండలి ఆధ్వర్యంలోని అన్ని ఎస్టీపీల ప్రాంగణాల్లో ఈడీ, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఎస్టీపీ సీజీఎం, జీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.