తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/HARISH-RAO.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ శుభవార్తనందించింది. రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఒక డిఎ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్దిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఫించనర్లు, ఉద్యోగుల మూల వేతనంపై 2.73% డిఎ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన డిఎ జూన్ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లు తెలిపారు. 2022 జనవరి నెల నుండి పెరిగిన డిఎ వర్తించనున్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెంచిన డిఎ ప్రకారం రూ. 1,380 కోట్ల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించాల్పి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ. 81.18 కోట్లు వరకు భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.