సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి మోదీ సందేశం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు.  ‘ఈరోజు సాయంత్రం 6 గంటలకు దేశ ప్ర‌జ‌ల‌తో ఓ విష‌యాన్ని పంచుకోవాల‌నుకొంటున్నాను. ద‌య‌చేసి అంద‌రూ వినాలి..’ అని ట్వీట్ చేశారు. మోదీ ఏ అంశంపై మాట్లాడతారో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం దేశాన్ని వేధిస్తున్న కోవిడ్-19 మహమ్మారి, చైనాతో వివాదం గురించి మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ అంశంపై సందేశమివ్వనున్నట్లు ప్రధాని పేర్కొనకపోవడం గమనార్హం. గతంలో అనేకసార్లు దేశవ్యాప్తంగా కరోనావైరస్‌పై సందేశమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే శీతాకాలం ప్రవేశించనున్న నేపథ్యంలో, పండుగల సీజన్‌ కావడంతో.. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితుల గురించి మాట్లాడవచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా, ప్రధాని జాతినుద్దేశించి సందేశమివ్వడం ఇది ఏడోసారి.

 

Leave A Reply

Your email address will not be published.