ఫ్రాన్స్ జాతీయ దినోత్సవపు వేడుకలకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడి

ఢిల్లీ (CLiC2NEWS): ఫ్రాన్స్‌లో జరగనున్న నేషనల్ డే సెలబ్రేషన్స్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. జులై 13,14 తేదీల్లో మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీన జరిగే ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్‌లో మోడీ పాల్గొననున్నారు. యూరప్‌లోనే అతి పెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ పరేడ్‌లో మోడీ గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ పరేడ్‌లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ ప్రధాన మంత్రితో పాటు సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతో సమావేశంకానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షడు ఇచ్చే అధికారిక విందుతో పాటు ప్రైవేటు విందును కూడా ఇవ్వనున్నారు. అనంతరం ఆ దేశంలో ఉన్న ప్రవాసి భారతీయులు, భారత్, ఫ్రెండ్ సంస్థల సిఇఒలు, ఇతర ప్రముఖులతోమోడీ సమావేశమవుతున్నట్లు సమాచారం.
[…] […]