అన్నమయ్య జిల్లాలో ఆర్‌టిసి బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురి మృతి
రాయచోటి (CLiC2NEWS): అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలంలో ఆర్‌టిసి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం కడప నుండి తిరుపతికి వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులకు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పుల్లంపేట సమీపంలోని రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌చేసి వాహనాలకు అంతరాయం కలగకుండా చేశారు.