బిజెపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బండి సంజ‌య్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించింది. దీనిలో ఆంధ్ర్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురికి చోటు ద‌క్కింది. ఈ కార్య‌ర్గంలో తెలంగాణ బిజెపి మాజీ అధ్య‌క్షుడు, క‌రీంగ‌న‌ర్ ఎంపి బండి సంజ‌య్‌ను పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. అలాగే జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా త‌రుణ్‌చుగ్‌, సునీల్ బ‌న్స‌ల్‌, కార్య‌ద‌ర్శిగా ఎపికి చెందిన సత్య‌కుమార్‌ను కొన‌సాగించ‌నున్నారు. అలాగే జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా డికె అరుణ‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి న‌డ్డా ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా తాజా మార్పుల‌తో బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గంలో మొత్తం 13 మంది ఉపాధ్య‌క్షులు, 9 మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, 13 మంది కార్య‌దర్శులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.