భ‌ద్ర‌కాళి చెరువుకు గండి.. జ‌ల‌మ‌య‌మైన ప‌లు కాల‌నీలు

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల‌కు ప్ర‌జా జీవ‌నం స్తంభించిపోయింది. వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా భారీగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది. భారీ వ‌ర్షానికి వ‌రంగ‌ల్ లోని భ‌ద్ర‌కాళి చెర‌వుకు గండి ప‌డింది. వరంగ‌ల్‌లో వ‌ర్ష‌పాతం భారీగా న‌మోదు కావ‌డంతో భ‌ద్ర‌కాళి చెరువుకు వ‌ర‌ద నీరు పెరిగింది. సామర్థ్యానికి మించి వ‌ర‌ద నీరు చేర‌డంతో భ‌ద్రాకాళి చెరువు పాత‌న న‌గ‌ర్ దిక్కున ఉన్న క‌ట్టకు గండి ప‌డింది. దాంతో పోత‌న న‌గ‌ర్‌, రాజీవ్ కాల‌నీ, స‌ర‌స్వ‌తి కాల‌నీకు భారీగా వ‌ర‌ద నీరు చేరింది. అధికార‌లు అప్ర‌మ‌త్త‌మై ముంపున‌కు గురైన ఇళ్ల‌ను ఖాళీ చేయిస్తున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, సిక్తా ప‌ట్నాయ‌క్‌, వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క క‌మిష‌న‌ర్ షేక్ రిజ్వాన్ అధికారులను అప్ర‌మ‌త్తం చేశారు. లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల త‌ర‌లించాలిన ఆదేశించారు.

కాగా గ‌త‌కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో తెలంగాణ అత‌లాకుత‌లం అవుతోంది. ప‌లు జిల్లాల్లోని ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, గ్రామాల్లో భారీగా వ‌ర‌ద ముంపుకు లోన‌య్యాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండ‌లా మారాయి. ప్రాజెక్టుల నుంచి నీరు భారీగా వ‌ద‌ల‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

భారీ వ‌ర్షాల‌తో వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, ములుగు, జ‌యశంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. తెలంగాణ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

Leave A Reply

Your email address will not be published.