ఎపిలో 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతించింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఉన్న మొత్తం 597 పోస్టులను ఎపిపిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులలో 89 గ్రూప్-1.. 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి. త్వరలో ఎపిపిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.