బుడతడు.. చిచ్చరపిడుగు.. హనుమాన్ చాలీసా పఠనంలో రికార్డ్..
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఆ బుడతడు చిచ్చర పిడుగు.. అతని ప్రతిభతో ఏకంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.. వివరాల్లోకి వెళ్లే.. పంజాబ్‌లోని భటిండాకు చెందిన గీతాన్స్ గోయల్ (5) హనుమాన్ చాలీసా ను పఠించడంలో రికార్డు సాధించాడు. ఈ ఐదేళ్ల బాలుడు ఒక నిముషం 54 సెకన్లలో హనుమాను చాలీసాను పఠించి అందరిని అశ్చర్య పరిచాడు. అతని ప్రతిభను మెచ్చి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్స్డ్‌లో చోటు కల్పించింది. ఈ రికార్డును ధ్రువీకరిస్తూ వరల్డ్ రికార్ట్స్ వర్సిటీ సైతం ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దాంతో రక్షా బంధన్ సందర్భంగా భారత్ రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్‌కాల్ కబురు వచ్చింది. రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రపతి ని గీతాన్స్ గోయల్ కలువనున్నట్లు బాలుడి తండ్రి డాక్టర్ విపిన్ గోయల్ తెలిపారు.