శంకర్‌దాదా ఎంబిబిఎస్ రీ రిలీజ్..

హైదరాబాద్ (CLiC2NEWS): 2004 వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సూపర్ హిట్ చిత్రం రీరిలీజ్ చేయబోతున్నారు. వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినమి ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు, శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆనాటి సంఘటనలు గుర్తుచేశారు. 2004 సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని హీరో శ్రీకాంత్ అన్నారు. అన్నయ్యతో కలసి నటించాలనే కల ఈ చిత్రం తీరిందన్నారు. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. రీరిలీజ్‌లో కూడా అంత సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.