బాడ్మింటన్ జోడి సాత్విక్-చిరాగ్‌కి ఖేల్‌రత్న.. పేసర్ షమికి అర్జున్ అవార్డు..

ఢిల్లీ (CLiC2NEWS): భారత్ స్టార్ బాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి దేశి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది. టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమికి అర్జున పురస్కారం దక్కింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర యుజవజ వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాద అర్జున్ అవార్డులకు 26 మందిని, ద్రోణాచార్య అవార్డు ఐదుగురు ఎంపికయ్యారు. ఈ అవార్డులను జనవరి 9వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారు.