తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష తేదీ ఖ‌రారు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే ప‌రీక్ష తేదీని టిఎస్‌పిఎస్‌సి ఖరారు చేసింది. జూన్ 9వ తేదీన ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 23వ తేదీ నుండి మార్చి 14 వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో మెయిన్ ప‌రీక్ష నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.