టిఎస్ఆర్‌టిసి ఉద్యోగుల‌కు 21% ఫిట్‌మెంట్: పొన్నం ప్ర‌భాక‌ర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): టిఎస్ఆర్‌టిసి ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఉద్యోగుల‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిఆర్‌సిని ప్ర‌క‌టించారు. వారికి 21% ఫిట్మెంట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇది జూన్ 1 నుండి కొత్త ఫిట్‌మెంట్ అమ‌లులోకి రానుంది. దీంతో టిఎస్ ఆర్‌టిసిపై అధ‌నంగా నెల‌కు రూ. 35 కోట్ల భారం ప‌డుతుంద‌ని తెలిపారు. ఈ పిఆర్‌సితో ఆర్‌టిసిలోని 53,071 మంది ఉద్యోగుల‌కు ఆర్ధిక ప్రయోజ‌నం చేకూర‌నుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.