వాలంటీర్లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటే చ‌ర్య‌లు.. సిఇఒ ముకేశ్‌మీనా

ఓటు న‌మోదు కోసం ఏప్రిల్ 15 వ‌ర‌కు అవ‌కాశం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎన్నిక‌ల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే చ‌ర్య‌లు తీసుకంటామ‌ని రాష్ట్ర ప్రధాన ఎన్న‌కల అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చ‌రించారు. వాలంటీర్లు ప్ర‌భుత్వంలో భాగ‌మేన‌ని.. వారు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌రాద‌ని సూచించారు. శ‌నివారం ఎన్నిక‌ల హెడ్యాల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడారు.
వాలంటీర్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎన్నిక‌ల విధుల్లోకి తీసుకోకూడ‌ద‌ని స్ఫ‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బందిని ఎన్నిక‌ల విధుల్లోకి తీసుకున్నాగానీ.. వారికి వేలికి ఇంకు వేయ‌డానికే ప‌రిమితం చేస్తామ‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఓటు న‌మోదు కోసం ఏప్రిల్ 15 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. పోలింగ్‌కు అయిదు రోజుల ముందు ఓట‌ర్ స్లిప్పులు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులు దాదాపు 3.82 ల‌క్ష‌ల మందితో పాటు 4 ల‌క్ష‌ల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామ‌న్నారు. ఈ ఎన్నిక‌ల‌కు 2 ల‌క్ష‌ల ఇవిఎంలు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.