కేజ్రివాల్ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ అరెస్టు .. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ అభివర్ణించారు. ఇది రాజకీయ ప్రేరేపితమని.. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బిజెపి పనిచేస్తోందని విమర్శించారు. వరస (హేమంత్ సోరెన్, కవిత) అరెస్టులు దీనికి పరాకాష్ట అన్నారు. ఇడి, సిబిఐ, ఐటిలను కేంద్రం పావులుగా వాడుకుంటుందని.. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి చర్యలను బిఆర్ ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.