హైదరాబాద్ నుండి అయోధ్యకు డైరెక్టు విమానం..

హైదరాబాద్ (CLiC2NEWS): అయోధ్య శ్రీరాముడి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. హైదరాబాద్ నుండి అయోధ్యకు డైరెక్టు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి వారానికి 3 రోజులు (మంగళవారం , గురువారం, శనివారం) ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
అయోధ్య రామయ్య దర్శనానికి విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26వ తేదీన లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లడినట్లు సమాచారం,