రాజేంద్ర‌న‌గ‌ర్ సూప‌ర్‌మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. రూ.కోటిపైగా న‌ష్టం

రంగారెడ్డి (CLiC2NEWS):  జిల్లాలోని రాజేంద్ర‌న‌గ‌ర్ పరిధిలోని ర‌త్న‌దీప్ సెలెక్ట్ సూప‌ర్ మార్కెట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గ‌తంలో ఇది ఫంక్ష‌న్ హాల్‌గా ఉండేది. దానిని రి ఇన్నోవేష‌న్ చేసి సూప‌ర్‌మార్కెట్‌గా మారుస్తున్నారు. ఈ క్ర‌మంలో వెల్డింగ్ ప‌నులు చేస్తుండ‌గా ఆదివారం మంటలు అంటుకున్నాయి. మంట‌లు వ్యాపించి ద‌ట్ట‌మైన పొగ వ్యాపించ‌డంతో అక్క‌డ ప‌నిచేసే సిబ్బంది ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ప్ర‌మాదంలో దాదాపు రూ. కోటి ఆస్తి న‌ష్టం ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.