ఐపిల్-17 సీజన్‌లో ముంబయి బోణి..
29 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం

వాంఖడే (CLiC2NEWS): ఐపిఎల్ -17 సీజన్‌లో ముంబయి బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా ముంబయి టీమ్ ఢిల్లీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ముంబయి 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. స్టబ్స్ 71* పరుగులు చేశాడు . ఓపెనర్ పృథ్వీ షా 66 , అభిషేక్ పొరెల్ 41 పరుగులు సాధించారు.