చిప్కో ఉద్యమనేత మురారి లాల్ మృతి

Chipko Movement: సామాజిక కార్యకర్త, సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్ (91) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం కన్నుమూశారు. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయిన దశోలి గ్రామ స్వరాజ్య మండల్‌కు లాల్ అధ్యక్షుడు. ఆయన తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు.