యుపిఎస్‌సి: ఎక‌నామిక్స్‌/ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీసుల్లో ఉద్యోగాలు

UPPSC: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎకనామిక్స్ / స‌్టా స్టాటిస్టిక‌ల్ స‌ర్వీసుల్లో జూనియ‌ర్ టైం స్కేల్ ఖాళీల‌ను బ‌ర్తీ చేయ‌నున్న‌ది. దీనికి సంబంధించిన ఇండియ‌న్ ఎక‌నామిక్ స‌ర్వీస్ (ఐఇఎస్‌) ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్ (ISSE)ఎగ్జామినేష‌న్‌ -2024 నిర్వ‌హించ‌నుంది. మొత్తం పోస్టులు 48 ఉన్నాయి. ఐఇఎస్ 18 పోస్టులు.. ఐఎస్ఎస్ఇ 30 ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 21 నుండి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎక‌నామిక్ స‌ర్వీస్‌కు పిజి (ఎక‌నామిక్స్ / అప్ల‌యిడ్ ఎక‌నామిక్స్ / బిజినెస్ ఎక‌నామిక్స్ / ఎక‌నామెట్రిక్స్‌),

స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్‌కు డిగ్రీ (స్టాటిస్టిక్స్ / మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్ / అప్ల‌యిడ్ స్టాటిస్టిక్స్) లేదా పిజి (స్టాటిస్టిక్స్ / మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్ / అప్ల‌యిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లోని ప‌రీక్ష కేంద్రం హైద‌రాబాద్‌గా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష జూన్ 21వ తేదీన నిర్వ‌హిస్తారు.

Leave A Reply

Your email address will not be published.