ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దు.. మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ (CLiC2NEWS): మేం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం.. ఇది మా గ్యారంటి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతులు ఒక్క గింజ ధాన్యం కూడా కనీస మద్దతు ధరకు తక్కువకు అమ్ముకోవద్దని అన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరితో రైతులు నష్ట పోతున్నారని ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఏర్పాటు చేశామని తెలిపారు. గత ఏడాది కొనుగోలు కేంద్రాలు 7,031 ఉండగా.. ప్రస్తుతం 7,149 ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 6,919 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు, రేషన్ సరఫరాల్లో ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో లాభనష్టాలను చూడకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం చూస్ఉతందన్నారు. కొన్ని చోట్ల ట్రేడర్లు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధరలకు కొనగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వెంటనే రవాణా చేసేలా ఆదేశాలిచ్చామని, రైతులకు సకాలంలో డబ్బులు బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.