కోవాగ్జిన్ వినియోగానికి భారత్ బయోటెక్ దరఖాస్తు

హైదరాబాద్: కరోనా అంతానికి గాను రూపొందించిన వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి గాను అనుమతించాల్సిందిగా భారత్ బయోటెక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకి దరఖాస్తు చేసుకుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. కోవాగ్జిన్‌ను భారత వైద్య పరిశోధనా మండలి భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ రూపొందించింది. ఇప్పటికే ఫైజర్, సీరం సంస్థలు కూడా తమ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాయి. ఈ మూడింటిపైనా బుధవారం నాడు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకోనుంది. మరి కొద్ది వారాల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోడీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.