దీదీ.. ఇది ఆరంభమే: అమిత్‌షా

కోల్‌కత్తా: `దీదీ.. ఇది కేవలం ఆరంభమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో మీరు ఒంటరిగా మిగులుతారు` అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి కేంద్రమంత్రి, బిజెపి అగ్ర నేత అమిత్‌షా అన్నారు. బెంగాల్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన శనివారం మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గని మాట్లాడారు. సువేందు అధికారిని సాదరంగా బిజెపిలోకి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో మమత సర్కారుపై ఆగ్రహించారు. మేనల్లుడిని సీఎం చేయడానికే దీదీ పాటుపడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లేదని, టిఎంసి గద్దె దిగితేనే రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి ఐదేళ్లు అవకాశమిస్తే.. రాష్ట్రాన్ని స్వర్ణబెంగాల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 200కిపైగా స్థానాల్లో విజయం సాధించి బెంగాల్లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అవినీతి, అధికార దుర్వినియోగం, బంధుప్రీతి వల్లే తృణమూల్ కాంగ్రెస్ నుండి చాలా మంది నేతలు వైదొలుగుతున్నారన్నారు.