Hyderabad: నగరంలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న కారు స్వాధీనం

హైదరాబాద్ (CLiC2NEWS ): 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీ చంద్రాయణ గుట్టలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లైసెన్స్ హోల్డర్ అయిన బాలాపూర్‌కి చెందిన వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను అజీజ్ మహరూస్‌కు అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వెంకటరెడ్డి, రమేష్, అజీజ్ మహరూస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.