రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌సభ సచివాలయం కీలక నిర్ణయం

ఢిల్లీ (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ నేత, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత పరువునష్టం కేసులో గురువారం గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2019 ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్.. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో అన్ని వ్యాఖ్యానించారిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు.
ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తిని తీర్పు వెలువడిన తేదీ నుండి రాజ్యాంగ పదువుల్లో ఉండే అర్హత కోల్పోతారు. దీని ప్రకారం లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. శిక్షా కాలంతోపాటు, మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు. 2013లో దేశ సర్వోన్నత న్యాయస్థానం .. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని స్సష్టం చేసింది.
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన న్యాయస్థానం..!