జలమండలిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

హైదరాబాద్ (CLiC2NEWS): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకలు ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సి, ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జలమండలి ఎండీ దానకిశోర్ హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ లాంటి మహనీయుడు జన్మించిన దేశంలో మనమంతా జన్మించడం అదృష్టమన్నారు. అంబేడ్కర్ కేవలం ఒక దేశానికి పరిమితమైన వ్యక్తి కాదని, ప్రపంచానికి గొప్ప ఆలోచనలు పంచిన నాయకుడని కీర్తించారు. అంబేడ్కర్‌ను స్మరించుకోవడం గొప్ప విషయమని, అయితే అంబేడ్కర్ ఆలోచనలను మన జీవితాల్లో నిరంతరం అమలు చేయడం, అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయడం మరింత ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ స్వామి, జలమండలి సీజీఎంలు, అధికారులు, కార్మికులు, టీఆర్ఎస్‌కేవీ రాష్ట్రాధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
–