AP: ఎస్‌సి యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ
మండపేట (CLiC2NEWS): ఎస్‌సి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎపి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ టివి రంగారావు తెలిపారు. ఎపిఎస్‌సి ఆర్‌టిసి ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అనంతరం వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు పదిమంది చొప్పున అభ్యర్థులను చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు మొత్తం 10 మందికి ఉచిత శిక్షణ కల్పిస్తారని తెలిపారు. వీరిలో 20 ఏళ్లు పైబడిన యువతీ యువకులు ఉండాలి. ఐదుగురు యువకులు, మరో ఐదుగురు యువతులకు ఈ అవకాశం కలుగుతుంది.
సంవత్సరం కాలపరిమితి గల హెవీ మోటార్ వెహికిల్ ( హెచ్ఎంవీ), లైట్ మోటార్ వెహికిల్ (ఎల్ఎంవీ) లైసెన్స్ కలిగి ఉన్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దరఖాస్తులను కాకినాడలోని ప్రగతి భవన్‌లో ఉన్న జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో అందజేయాలి. ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ఆసక్తిగల అభ్యర్థులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
Also Read: రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్