మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/Chandrababu-naidu.jpg)
అమరావతి (CLiC2NEWS): ఎపి హైకోర్టు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏకంగా మూడు కేసుల్లో ఒకే సారి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబుపై ఎపి సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాబుతో పాటు మాజి మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఎఎస్ శ్రీనరేశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.