కాపు ఉద్యమకారులపై కేసులు ఉపసంహరణ పట్ల ఎపి కాపునాడు హర్షం..

మండపేట (CLiC2NEWS): రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమాల్లో పాల్గొన్న అందోళన కారులపై గత తెలుగుదేశం ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను వైసీపీ ప్రభుత్వం కేసులను ఎత్తివేయడం పట్ల అంధ్రప్రదేశ్ కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి కొండలరావు, కోశాధికారి వాదా ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి శేషగిరిరావు, అధికార ప్రతినిధి ఈటి రంగారావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి కోరుకొండ పద్మ, గంటా ఈశ్వరరావు, గొన్నా రమాదేవి, సూరపురెడ్డి శ్రీనివాస్ తమ హర్షాన్ని వ్యక్తం చేసారు.