పేకాట రాయుళ్లు అరెస్టు..

మండపేట (CLiC2NEWS): మండపేట రూరల్ మండలం ఇప్పనపాడు గ్రామంలో పాఠశాల సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని రూరల్ ఎస్ఐ శివ కృష్ణ మెరుపు దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.13,500 నగదు స్వాధీన పరచుకుని కేసు నమోదు చేశారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతూ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే లేదా పేకాట, కోడి పందాలు ఆడుతుంటే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.