Asia Cup: అద‌ర‌గొట్టిన టీమిండియా

విజేత జ‌ట్టుకు రూ. 21 కోట్ల న‌జ‌రానా

దుబాయ్‌ (CLiC2NEWS): ఆసియా క‌ప్‌లో టీమిండియా అద‌ర‌గొట్టింది. భార‌తీయులకు ద‌స‌రా పండుగ మందే వ‌చ్చిందా అన్న‌ట్లుంది. ముఖ్యంగా ఈ టోర్నీలో మూడు సార్లు దాయాది పాకిస్థాన్‌ను ఓడించి అభిమానుల‌కు మంచి వినోదాన్ని పంచింది. ఆదివారం జరిగిన ఫైన‌ల్లో మ‌న తెలుగు వాడు తిల‌క్ వ‌ర్మ కీల‌క పాత్ర పోషించ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

టాస్ గెలిచి పాక్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవ‌ర్లో 146 ప‌రుగ‌ల‌కు ఆలౌట్ అయింది. తుదుప‌రి బ్యాటింగ్ మొద‌లెట్టిన టీమిండియా 19.4 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగు సాధించి ఆసియా క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ఈ దెబ్బ‌తో తొమ్మిదో సారి ఆసియా క‌ప్‌ను టీమిండియా ముద్దాడింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ స‌హా భార‌త ప్ర‌ముఖుల‌తో పాటు సామాన్యులు కూడా టీమిండియా విజ‌యానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

విజేత‌ల‌కు రూ. 21 కోట్ల న‌జ‌రానా

తొమ్మిదోసారి ఆసియా క‌ప్ కైవ‌సం చేసుకున్న టీమిండియా ఆట‌గాళ్ల‌కు రూ. 21 కోట్ల న‌జ‌రానాను ప్ర‌క‌టించారు నిర్వాహ‌కులు. ఈ మొత్తాన్ని ఆట‌గాళ్ల‌తో పాటు స‌హాయ‌క సిబ్బందికి అందించ‌నుంది. ఈ మేర‌కు బిసిసిఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా వెల్ల‌డించారు.

ఎసిసి కూడా ఫ్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించింది. భార‌త్‌కు ఎసిసి రూ. 2.65 కోట్ల‌ను ప్రైజ్ మ‌నీగా, ర‌న్న‌ర‌ప్ పాక్‌కు రూ. 66. 75 ల‌క్ష‌లు అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

క‌ప్ అందుకోని టీమిండియా

ఆసియా క‌ప్‌లో విజేత‌గా నిలిచిన టీమిండియా టైటిల్ ట్రోఫీని అందుకునేందుకు మాత్రం నిరాక‌రించింది. దీనికి కార‌ణం పాక్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ చేతుల‌ మీదుగా ట్రోఫీ తీసుకోవాల్సి రావ‌డం… కానీ అన‌వాయితీ ప్ర‌కారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) అధిప‌తే ట్రోఫీని అంద‌జేస్తాడు. ప్ర‌స్తుతం ఎసిసి చీఫ్ న‌ఖ్వీనే కావ‌డంతో క‌ప్ తీసుకోవ‌డానికి భార‌త్ నిరాక‌రించింది.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో టీ మిండియా ప్లేయ‌ర్లు పాక్ ప్లేయ‌ర్ల‌కు క‌ర‌చాల‌నం కూడా చేయ‌లేదు. అలాగే క‌ప్ గెలిచినా న‌ఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవ‌డాన్నీ కూడా టీమిండియా నిరాక‌రించింది. దాంతో టీమిండియా టైటిల్ ట్రోఫీని అందుకోకుండానే ఈ వేడుక ముగిసింది.

Also Read: Telangana: మోగిన `స్ఘానిక‌` న‌గారా

 

View this post on Instagram

 

A post shared by Harshita (@i_harshita_22)

1 Comment
  1. […] Also Read: Asia Cup: అద‌ర‌గొట్టిన టీమిండియా […]

Leave A Reply

Your email address will not be published.