Telangana: మోగిన `స్ఘానిక‌` న‌గారా

షెడ్యూలు విడుద‌ల చేసిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): మొత్తానికి తెలంగాణ‌లో ఇవాళ (సోమ‌వారం) స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ గ్రామ‌పంచాయ‌తి, ఎంపిటిసి, జ‌డ్పిటిసి ఎన్నిక‌ల షెడ్యూలును విడుద‌ల చేసింది. షెడ్యూలు వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాణికుముదిని వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల‌ను మొత్తంగా 5 ద‌శ‌ల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.

తొలి రెండు ద‌శ‌ల‌లో: ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నిక‌లు..
తేదీలు : అక్ట‌బోరు 23, 27

మూడు ద‌శ‌ల్లో గ్రామ‌పంచాయ‌తి ఎన్నిక‌లు
తేదీలు తొలి విడ‌త అక్టోబ‌రు 31,
రెండో విడ‌త న‌వంబ‌ర్ 4న‌
మూడో విడ‌త న‌వంబ‌ర్ 8న నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

పోలింగ్ పోర్త‌యిన వెంట‌నే అదే రోజు గ్రామ‌పంచాయ‌తి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు.
న‌వంబ‌రు 11వ తేదీన ఎంపిటిసి, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు జ‌రుగ‌నుంది.

మొత్తంగా రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండ‌లాల్లో ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని ఎస్ ఇ సి తెలిపారు.

12,733 డ్రియ‌పంచాయ‌తీలు, 1,12,288 వార్డుల్లో అలాగే 5,749 ఎంపిటిసి, 565 జ‌డ్పిటిసి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు..

జ‌డ్పిటిసి తొలి విడ‌త తేదీలు

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌రు 9
నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 11
నామినేష‌న్ల ప‌రిశీల‌న‌: అక్టోబ‌రు 12
నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌: అక్టోబ‌రు 15
ఎన్నిక‌ల‌ తేదీ: అక్టోబ‌రు 23
ఓట్ల లెక్కింపు: న‌వంబ‌రు 11

జ‌డ్పిటిసి రెండో విడ‌త తేదీలు

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌రు 13
నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 15
నామినేష‌న్ల ప‌రిశీల‌న‌: అక్టోబ‌రు 16
నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌: అక్టోబ‌రు 19
ఎన్నిక‌ల‌ తేదీ: అక్టోబ‌రు 27
ఓట్ల లెక్కింపు: న‌వంబ‌రు 11

గ్రామ పంచాయ‌తి తొలివిడ‌త ఎన్నిక‌లు

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌రు 17
నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 19
నామినేష‌న్ల ప‌రిశీల‌న‌: అక్టోబ‌రు 20
నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌: అక్టోబ‌రు 23
ఎన్నిక‌ల‌ తేదీ ఫ‌లితాలు : అక్టోబ‌రు 31

గ్రామ పంచాయ‌తి రెండో విడ‌త ఎన్నిక‌లు

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌రు 21
నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 23
నామినేష‌న్ల ప‌రిశీల‌న‌: అక్టోబ‌రు 24
నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌: అక్టోబ‌రు 27
ఎన్నిక‌ల‌ తేదీ ఫ‌లితాలు : న‌వంబ‌రు 4

గ్రామ పంచాయ‌తి మూడో విడ‌త ఎన్నిక‌లు

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌రు 25
నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 27
నామినేష‌న్ల ప‌రిశీల‌న‌: అక్టోబ‌రు 28
నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌: అక్టోబ‌రు 31
ఎన్నిక‌ల‌ తేదీ ఫ‌లితాలు : న‌వంబ‌రు 8

Also Read: MGBS నుంచి ప్రారంభ‌మైన బ‌స్సులు

1 Comment
  1. […] Telangana: మోగిన `స్ఘానిక‌` న‌గారా […]

Leave A Reply

Your email address will not be published.