బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లలో ద‌స‌రా ర‌ద్దీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌ర‌వాసి ప‌ల్లెబాట ప‌ట్టాడు. విజ‌య‌ద‌శ‌మి నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రవాసులు స్వ‌గ్రామాల‌కు త‌ర‌లుతున్నారు. ఈనేప‌థ్యంలో జంగ‌న‌గరాల్లోని బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట‌లాడుతున్నాయి. క‌రీనంగ‌న‌ర్‌, మంచిర్యాల‌, నిజ‌మాబాద్‌, నిర్మ‌ల్ వైపు వెళ్లే ప్ర‌యాణికుల‌తో సికింద్రాబాద్ లోని జూబ్లీ బ‌స్ స్టేష‌న్ కిట‌కిట‌లాడుతోంది. ఇక్క‌డ బ‌స్సుల కోసం ప్ర‌యాణికులు భారీ సంఖ్య‌లో వేచి ఉన్నారు.

న‌గ‌రంలోని ఎంబిజిఎస్ బ‌స్‌స్టేష‌న్లో కూడా ప్ర‌యాణికుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంది. ఈనేప‌థ్యంలో తెలంగాణ ఆర్టీసీ ద‌స‌రా స్పెష‌ల్ బ‌స్సుల‌ను కూడా న‌డుపుతోంది. ప్ర‌యాణికుల‌త సౌక‌ర్యార్థం బ‌స్సుల సంఖ్య‌ను పెంచిన‌ట్లు ఆర్టీసీ అధికారులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

అలాగే సికింద్రాబాద్‌, నాంప‌ల్లి (హైద‌రాబాద్‌), చ‌ర్ల‌ప‌ల్లి, కాచిగూడ త‌దిత‌ర రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ విప‌రీతంగా ఉంది. దీంతోపాటు ప‌లువురు సొంత వాహాల్లో, మ‌రికొంద‌రు ప్రైవేటు వాహ‌నాల‌తో స్వ‌గ్రామాల‌కు త‌ర‌లివెళ్తున్నారు. దీనంతో ర‌హ‌దారులపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్ప‌డుతోంది.

Also Read: Asia Cup: అద‌ర‌గొట్టిన టీమిండియా

1 Comment
  1. […] బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లలో ద‌స‌… […]

Leave A Reply

Your email address will not be published.