Mandapeta: దిశ యాప్ పై అవ‌గాహ‌ణ కార్య‌క్ర‌మం

మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి

మండపేట (CLiC2NEWS): మహిళల రక్షణ కోసం చట్టం మహిళల భద్రతకు ఉపయోగ పడుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. 28, 29 వార్డుల్లో దిశ చట్టంపై అవగాహన, యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధానం పై మహిళలు అవగాహణ కల్పించారు. కౌన్సిలర్ లు మొండి భవాని, పిల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో జరిగిన అవగాహణ సదస్సు లో ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ దుర్గారాణి పాల్గొన్నారు. టౌన్ సీఐ నున్న రాజు హాజరై దిశ చట్టం ఆవశ్యకతను వివరించారు. ఈ చట్టం మహిళల భద్రతకు ఉపయోగ పడుతుంది అన్నారు. దీని కోసం ప్రభుత్వం యాప్ కూడా రూపొందించింది అన్నారు. ప్రతి మహిళా ఈ యాప్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని రిజిష్టర్ అవ్వాలి అన్నారు. ఆపద కాలంలో యాప్ ద్వారా చిన్న సందేశం పంపితే పోలీసులు కాపాడటానికి వీలు పడుతుంది అన్నారు. మహిళల సెల్ ఫోన్ లో యాప్ నిక్షిప్తమై ఉంటే ఒక పోలీసు రక్షణగా మీ వెంట ఉన్నట్టేనని అన్నారు. దీనిపై ప్రతి మహిళ అవగాహణ పెంచుకొని చైతన్యం కావాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలు అందరి చేత దిశ యాప్ డౌన్ లోడ్ చేయించారు. కార్యక్రమంలో 27 వ వార్డు కౌన్సిలర్ నీలం దుర్గమ్మ, 25 వ వార్డు కౌన్సిలర్ అమలదాసు లక్ష్మి, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, ఏ ఎన్ ఎం లు, వార్డు మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.