మండపేటలో కరోనాపై అవగాహన ర్యాలీ
మండపేట (CLiC2NEWS): కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మండపేటలో పీఎంపీ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. అసోసియేషన్ నాయకులు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి టౌన్ ఎస్సై బి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీ ప్రారంభించారు. స్థానిక టౌన్ హాల్ నుండి ప్రారంభమైన అవగాహనా ర్యాలీ కలువ పువ్వు సెంటర్ బస్ స్టాండ్ రాజరత్న సెంటర్ వరకూ సాగింది. రహదారి పొడవునా ఇరుప్రక్కలా ఉన్న ప్రజలకు మాస్క్ లు పంపిణీ చేశారు. కరోనా వద్దు మాస్క్ లు ముద్దు అని నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ కోవిడ్19 ఉధృతి ఇంకా తగ్గలేదని అన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలకు ఏ ముప్పు ఉండదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. వ్యాపార కేంద్రాల వద్ద నిర్వాహకులు ,వినియోగదారులు సామజిక దూరం పాటించడం ముఖానికి మాస్కులు పెట్టుకోవడం శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ నాయకులు కోన సత్యనాయణ, గంగుమళ్ల రాంబాబు, బల్లా వెంకట రమణ, వానపల్లి కనకరాజు, యేడిద లక్ష్మణాచార్యులు,మారిశెట్టి సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.