Mandapeta: సర్కార్ నిబంధనలు పాటిస్తూ బక్రీదు పండుగ జరుపుకోవాలి..
జమాతె ఇస్లామీ హింద్ మండపేట శాఖ....
మండపేట(CLiC2NEWS): సర్కార్ నిబంధనలు పాటిస్తూ బక్రీదు పండుగ ను ఘనంగా జరుపుకోవాలని జమాతె ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జమాత్ కార్యలయంలో మీడియాతో సమావేశంలో ఎస్ ఐ ఓ అధ్యక్షులు వసీం ఐ వై ఎం అధ్యక్షులు అబ్దుల్ హమీద్ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతు పవిత్ర బక్రీదు పండుగ త్యాగాల పండుగని ఇబ్రాహీం ప్రవక్త త్యాగాలకు గుర్తుగా ముస్లింలు ఈ పండుగను చేసుకుంటారని అన్నారు. ఐ వై ఎం అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా ముస్లిం సోదరులందరు ఈద్ ను చేసుకోవాలని ఆయన అన్నారు. ఎస్ ఐ ఓ అధ్యక్షులు వసీం మాట్లాడుతూ ఖుర్బాని సందర్భంగా అత్యధికంగా పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ స్థానిక ఉపాధ్యక్షులు రిజ్వాన్, ఐవైఎం కార్యదర్శి ఉసామా, ఎస్ ఐ ఓ ప్రాంతీయ కార్యదర్శి అతీఖ్ తదితరులు పాల్గొన్నారు.